Advertisementt

హాట్ టాపిక్ గా కల్కి 2 ఇంటర్వెల్ ఎపిసోడ్

Wed 22nd Apr 2026 05:36 PM
kalki 2  హాట్ టాపిక్ గా కల్కి 2 ఇంటర్వెల్ ఎపిసోడ్
Crazy news on Kalki 2 interval episode హాట్ టాపిక్ గా కల్కి 2 ఇంటర్వెల్ ఎపిసోడ్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన కల్కి చిత్రానికి సీక్వెల్ గా రీసెంట్ గా మొదలైన కల్కి 2 షూటింగ్ లో ఇంకా ప్రభాస్ పాల్గొనపోయినా.. విలన్ పాత్రధారి కమల్ హాసన్,  కీలక పాత్రధారి అమితాబచ్చన్ లపై కీలక సన్నివేశాలను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ కూడా మే ఫస్ట్ వీక్ లో కల్కి 2 సెట్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. తాజాగా కల్కి 2 ఇంటర్వెల్ ఎపిసోడ్ కి సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతోంది. కల్కి 2 కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ని నిర్మిస్తోందట. ఈ సెట్లో సినిమాకే హైలైట్ గా నిలిచే ఇంటర్వెల్ బ్లాక్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. 

కల్కి 2 లో వచ్చే అత్యంత కీలకమైన ఈ సన్నివేశంలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా పాల్గొంటారని సమాచారం. కల్కి లో ఈ ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటున్నారు. ఈ చిత్రం నుంచి దీపికా ను తప్పించిన మేకర్స్ సాయి పల్లవిని ఎంపిక చేసారనే న్యూస్ ఉంది కానీ అఫీషియల్ అప్ డేట్ లేదు. 

Crazy news on Kalki 2 interval episode:

Kalki 2 Shooting update

Tags:   KALKI 2
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ