పాన్ ఇండియా మూవీస్ ఒక్కొక్కటి విడుదల తేదీలు లాక్ చేసి అధికారికంగా ప్రకటించేస్తున్నారు. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ ని వచ్చే ఏడాది మార్చి 5 రిలీజ్ అంటూ దర్శకుడు సందీప్ వంగ ఎప్పుడో ప్రకటించాడు. అలాగే రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ ల కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి ఏప్రిల్ 7, 2027 న విడుదల కాబోతుంది.
ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ వచ్చే ఏడాది అంటే 2027 జూన్ 11 రిలీజ్ అంటూ పక్కాగా డేట్ పై క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమాలన్నీ ఖచ్చితమైన డేట్ కి వస్తాయా, రావా అనేది తర్వాత విషయం. ఇప్పుడైతే పక్కాగా విడుదల తేదీలపై స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చింది.
కానీ అల్లు అర్జున్ - అట్లీ రాకా విషయాన్ని తేల్చకుండా కన్ఫ్యూజ్ చేసారు. అల్లు అర్జున్ బర్త్ డే కి ప్రీ లుక్ పోస్టర్ తో టైటిల్ రివీల్ చేసారు కానీ.. విడుదల తేదీ ఇవ్వలేదు. కనీసం 2027 రిలీజ్ అని కూడా వెయ్యలేదు. మరి రాకా 2027 కి వస్తుందా, లేదంటే 2028 కి వెళ్లిపోతుందో. అందుకే మేకర్స్ కూడా రాకా విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. మరి ఉన్నవాటిలో రాకా విడుదల తేదీనే బ్యాలెన్స్.




బాలయ్య-కొరటాల కాంబో.. చకచకా
Loading..