Advertisementt

బాలయ్య-కొరటాల కాంబో.. చకచకా

Wed 22nd Apr 2026 03:22 PM
balakrishna  బాలయ్య-కొరటాల కాంబో.. చకచకా
Balayya to reportedly collaborate with Koratala Siva బాలయ్య-కొరటాల కాంబో.. చకచకా
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ లైనప్ చూస్తే మెంటలెక్కిపోద్ది. ఆ రేంజ్ లో బాలయ్య సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్రెజెంట్ గోపీచంద్ మలినేని తో NBK 111 చేస్తున్న బాలయ్య లైనప్ లో ఆతర్వాత ఆదిత్య 999 ఉండనే ఉంది. కానీ ఈలోపే మీడియం రేంజ్ డైరెక్టర్స్ అయిన విజయ్ కనకమేడల, వివేక్ ఆత్రేయాకు ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆ ఇద్దరూ బాలయ్య కోసం సీరియస్ గా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఇంతలో సడన్ గా కొరటాల శివ లైన్ లోకి వచ్చారు. ఎన్టీఆర్ తో చెయ్యాల్సిన దేవర 2 కి సమయం ఉండడంతో కొరటాల బాలయ్య ను కలిసి కథ చెప్పి ఒప్పించారనే టాక్ నడుస్తుండగానే.. ఆ సినిమాకి సంబందించిన మరో అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అది బాలయ్య-కొరటాల కాంబో మూవీ ఓకే అవడమే కాదు, ఈ చిత్రం పవర్ ఫుల్ సబ్జెక్టు తో కొరటాల స్టయిల్ సోషల్ మెసేజ్ ఉండేలా ప్లాన్ చేశారట. ఇంకా అనౌన్సమెంట్ రాకుండానే దర్శకుడు కొరటాల శివ బాలయ్య సినిమా కోసం ఆఫీస్ తీసారనే వార్త మాత్రం మాములుగా వైరల్ అవ్వట్లేదు. ఇంత ఫస్ట్ గానా కొరటాలా అంటూ నందమూరి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు.

Balayya to reportedly collaborate with Koratala Siva:

Balakrishna Chooses Koratala Over Vivek Athreya

Tags:   BALAKRISHNA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ