పాన్ ఇండియా స్టార్స్ లో ప్రస్తుతం పుష్ప పార్ట్ 1, పుష్ప పార్ట్ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ తో అల్లు అర్జున్ రేజింగ్ లో కనిపిస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్లంతా అల్లు అర్జున్ తర్వాతే అనేలా అల్లు అర్జున్ క్రేజ్ కనిపిస్తుంది. కానీ పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ముందు అల్లు అర్జున్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బాహుబలి ఇంపాక్ట్ తర్వాత సాహో, సలార్, కల్కి చిత్రాలతో ప్రభాస్ స్టామినా పాన్ ఇండియా మార్కెట్ లో ప్రూవ్ అవుతూనే ఉంది.
అందుకే ఓర్మాక్స్ జాబితాలో ఎప్పటికప్పుడు ప్రభాస్ నెంబర్ 1 ప్లేస్ ని ఆక్రమిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభాస్ టాప్ 1 లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం మార్చ్ నెల జాబితాను ఓర్మాక్స్ విడుదల చేసింది. అందులో ఎప్పటిలాగే ప్రభాస్ నెంబర్ 1 స్థానంలో కనిపించారు. ఆతర్వాత స్థానంలో రాకా హీరో అల్లు అర్జున్ నిలిచారు.
గత నెలలో మూడో స్తానంలో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు రెండో స్థానంలోకి చేరారు. పుష్ప సీరీస్ తో పాన్ ఇండియా మార్కెట్ లో బలమైన ముద్ర వేసిన అల్లు అర్జున్ ఇప్పుడు రాకా తో పాన్ వరల్డ్ ని కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మూడో స్థానంలో కోలీవుడ్ హీరో విజయ్ నిలిచారు. ప్రస్తుతం ఆయన సినిమాలు వీడుతున్నట్లుగా ప్రకటించినా ఆయన హవా ఏ మాత్రం తగ్గలేదు.
నాలుగో స్థానంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ నిలిస్తే ఐదో స్థానంలో వారణాసి హీరో సూపర్ స్టార్ మహేష్ నిలిచారు. ఇక ఆరో ప్లేస్ ని రామ్ చరణ్ సొంతం చేసుకోగా.. ఏడో స్థానాన్ని సల్మాన్ తీసుకున్నారు. గత నెలలో ఎనిమిదో స్థానంలో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోగా.. మొదటిసారి రణ్వీర్ సింగ్ టాప్ 10 లో చోటు సంపాదించుకుని ఎనిమిదో స్టాన్ని కైవసం చేసుకున్నారు.




డాన్ 3 - పదికోట్లు ఇచ్చేస్తున్న రణ్వీర్
Loading..