బాలీవుడ్ లో డాన్ 3 వివాదం ముదిరిపాకాన పడింది. డాన్ 3 నుంచి ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్ తప్పుకోవడం సంచలనం సృష్టించడమే కాదు, ఫర్హాన్ అక్తర్ కి, రణ్వీర్ సింగ్ కి మధ్యన వివాదం నెలకొంది. డాన్ 3 షూటింగ్ ఆలస్యం కావడం మరియు ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు రణ్వీర్ సింగ్.
అయితే ఈప్రాజెక్టు నుంచి రణ్వీర్ తప్పుకోవడం వల్ల తమకు రూ.40 కోట్ల నష్టం వాటిల్లింది అంటూ నిర్మాతలు రచ్చ కెక్కారు. అయితే ఈ వివాదం సద్దుమణిగేలా రణ్వీర్ సింగ్ నిర్మాతలకు రూ.10 కోట్లు వెనక్కి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని, అంతేకాకుండా తన తదుపరి చిత్రం ప్రళయ్ లో ఫర్హాన్ అక్తర్ నిర్మాణసంస్థకు వాటా ఇవ్వడానికి కూడా రణ్వీర్ సింగ్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
మరి రణ్వీర్ ఇస్తాను అన్న రూ.10 కోట్ల కు ఫర్హాన్ అక్తర్ ఒప్పుకుంటాడా, ఇప్పటికే రూ.40 కోట్లు డిమాండ్ చేసిన ఆయన ఇప్పుడు ఈ పది కోట్ల డీల్ ని ఓకే చేస్తారా అనే విషయంలో బాలీవుడ్ మీడియా క్యూరియాసిటీగా కనిపిస్తుంది.




శ్రీదేవి ఇమేజ్‌నే జాన్వీ కపూర్ నమ్ముకుందా
Loading..