Advertisementt

శ్రీదేవి ఇమేజ్‌నే జాన్వీ కపూర్ నమ్ముకుందా

Wed 22nd Apr 2026 11:04 AM
janhvi kapoor  శ్రీదేవి ఇమేజ్‌నే జాన్వీ కపూర్ నమ్ముకుందా
Sridevi Daughter Janhvi Kapoor శ్రీదేవి ఇమేజ్‌నే జాన్వీ కపూర్ నమ్ముకుందా
Advertisement
Ads by CJ

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా భారీ అంచనాల మధ్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.  తన తొలి ప్రయత్నంలోనే ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన నటించిన `దేవర` చిత్రంలో కేవలం పాటలకే పరిమితమై, నటనకు ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించడం ఆమె క్రేజ్‌కు ప్లస్ అవ్వలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన `పెద్ది` వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో న‌టిస్తున్నా? ఒక స్టార్ కిడ్ సినిమాకు ఉండాల్సిన సందడి గానీ, సోషల్ మీడియాలో చర్చ గానీ ఆమె విషయంలో కనిపించకపోవడం ఆశ్చర్యకరం.

ఈ స్తబ్దతను పోగొట్టుకోవడానికి జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవికి ఇక్కడి ప్రేక్షకులతో ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను ఒక బ్రహ్మాస్త్రంలా వాడుకునే ప్రయత్నం చేస్తోందా? అన్న సందేహం తాజాగా తెరపైకి వ‌స్తోంది. ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో జాన్వీ క‌పూర్ మామ్ కి  దక్షిణాది సినిమాలంటే ఉన్న గౌరవాన్ని, ఇక్కడి ప్రేక్షకులు ఆమెను ఆదరించిన తీరును పదే పదే గుర్తు చేస్తోంది. శ్రీదేవి నటించిన చిత్రాలు, ఆమె చేసిన విభిన్న పాత్రలను ప్రస్తావిస్తూ ఆ సెంటిమెంట్  తో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు గెలవాలని జాన్వీ ప్రయత్నిస్తున్నట్లు క‌నిపిస్తుంది. తల్లి పేరుతో ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీని తన కెరీర్‌కు మైలేజ్ ఇచ్చేలా మలచుకుంటోందని అంటున్నారు.

కేవలం తల్లి పేరు చెప్పుకుని లేదా సెంటిమెంట్‌ను పండించి ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. స్టార్ కిడ్స్ విషయంలో సెంటిమెంట్ అనేది ప్రారంభంలో కొన్ని సినిమాల వరకు మాత్రమే పని చేస్తుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన హీరోయిన్ల పోటీ తీవ్రంగా ఉంది. వారిని తట్టుకుని నిలబడాలంటే జాన్వీ సొంత ప్రతిభను, నటనను నిరూపించుకోవాల్సిందే. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం కొంతకాలమే సాగుతుంది.  అసాధారణమైన పెర్ఫార్మర్‌గా గుర్తింపు పొందితేనే తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని స్టార్ కిడ్స్ గుర్తించాల్సిన అవసరం ఉంది.

Sridevi Daughter Janhvi Kapoor:

Actress Janhvi Kapoor

Tags:   JANHVI KAPOOR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ