దేవర చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర 2 కోసమే స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉంటూ వేరే కమిట్మెంట్ పెట్టుకోని దర్శకుడు కొరటాల శివ.. ఎన్టీఆర్ ఎప్పుడు ఫ్రీ అవుతాడా.. దేవర 2 ని ఎపుడు పట్టాలెక్కిద్దామా అని కాచుకుని కూర్చున్నారు. కానీ ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే ఫ్రీ అయ్యే ప్రసక్తే లేదు. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.
#NTRNeel మూవీ 2027 జూన్ 11 న విడుదల అని అనౌన్సమెంట్ వచ్చిన కొద్దిసేపటికే కొరటాల శివ మరో స్టార్ హీరో తో కమిట్ అయ్యారనే వార్త వైరల్ అయ్యి కూర్చుంది. అది నందమూరి బాలకృష్ణ - కొరటాల కాంబో సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. దేవర 2 లేట్ అవడం, ఇంతకుముందు బాలయ్య కి కథ చెప్పి కొరటాల ఒప్పించారనే వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.
నిజంగా కొరటాల బాలయ్య కాంబినేషనే కాదు, మరె ఇతర హీరోతో సినిమా చేసినా.. కొరటాల నిర్ణయం తెలివైన నిర్ణయం అనాల్సిందే. కారణం ఎన్టీఆర్ కోసం మరో ఏడాది టైమ్ వేస్ట్ చేసుకోవడం కన్నా తెలివి తక్కువ తనం మరొక్కటి ఉండదు. ఒకవేళ కొరటాల-బాలయ్య అంటే ఆ క్రేజు మాములుగా ఉండదు.




టాలీవుడ్లో విషాదం - చిట్టిబాబు కన్నుమూత
Loading..