Advertisementt

పెద్ది త‌ర్వాత చ‌ర‌ణ్ గురి దీనిపైనే

Wed 22nd Apr 2026 09:32 AM
peddi  పెద్ది త‌ర్వాత చ‌ర‌ణ్ గురి దీనిపైనే
Whats Next For RamCharan After Peddi పెద్ది త‌ర్వాత చ‌ర‌ణ్ గురి దీనిపైనే
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రాల విషయంలో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న `పెద్ది` చిత్రం షూటింగ్‌లో చరణ్ తన భాగాన్ని మ‌రో ఆరు రోజుల్లోనే పూర్తి చేస్తాడు. ఈ సినిమా షూటింగ్ ముగియగానే చెర్రీ పూర్తి దృష్టి ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొంద‌నున్న RC17 పైనే నిలిచింది. `గేమ్ ఛేంజర్` తర్వాత చరణ్ ప్లానింగ్ వైవిధ్యంగా సాగుతోంది. అత‌డు తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకునేలా వరుసగా భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

 

`రంగస్థలం`వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. `పుష్ప 2` విజయంతో జోరు మీదున్న సుకుమార్.. చరణ్ కోసం సాంస్కృతిక అంశాలతో కూడిన ఒక భారీ స్థాయి పాన్ ఇండియా కథాంశాన్ని సిద్ధం చేశారు. గ్లోబల్ స్థాయిలో అప్పీల్ ఉండేలా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Whats Next For RamCharan After Peddi:

  Ram Charan To Concentrate On This After Peddi  

Tags:   PEDDI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ