సూపర్ స్టార్ రజినీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జైలర్ 2 చిత్రం షూటింగ్ పూర్తయినట్లుగా ఓ ఫొటో ని షేర్ చేస్తూ మేకర్స్ గ్రాండ్ గా అనౌన్స్ చేసారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ని పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తూనే దర్శకుడు కథకు అవసరమైన స్టార్ క్యామియోస్ తో జైలర్ ని బ్లాక్ బస్టర్ చేసాడు.
ఇప్పుడు జైలర్ 2 లోని మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లు కంటిన్యూ అవ్వగా.. మరో గెస్ట్ రోల్ కోసం చాలామంది క్రేజీ హీరోల పేర్లు వినిపించాయి. నందమూరి బాలకృష్ణ దగ్గరనుండి, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు జైలర్ 2 లో గెస్ట్ పాత్ర కోసం వినిపించిన పేర్లలో ఉన్నాయి.
మరి జైలర్ 2 షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసారు. అసలు ఇంతకీ ఆ కీలక క్యామియో లో కనిపించే స్టార్ ఎవరు అనేది రివీల్ అవ్వలేదు. కనీసం ఎలాంటి క్లూ కూడా లేకుండా నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 ని ముగించేశారు. ఇక సినిమా ని జూన్ లో విడుదల అన్నారు. అనుకున్నట్టుగానే జైలర్ 2ని నెల్సన్ దిలీప్ రిలీజ్ కి తెస్తారా, లేదంటే మరో కొత్త డేట్ ఇస్తారా అనేది చూడాలి.




Loading..