బన్నీ ట్వీట్ పెద్ది కి హెల్ప్ అవుతుందా?
Allu Arjun reacts to Ram Charan’s Peddi
గత గురువారం విడుదలైన పెద్ది చిత్రానికి ఓ గొప్పగా ఉంది అనే టాక్ రాకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పెద్ది కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఈ చిత్ర హిట్ అయినట్లే అనిపిస్తుంది. మిగతా పాన్ ఇండియా భాషల్లో పెద్ది కి అంతగా కలెక్షన్స్ కనిపించడం లేదు. మరోపక్క పెద్ది చిత్రం బావుంది అంటూ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఎవరూ ట్వీట్ వేయనూ లేదు.
ఆఖరికి అల్లు హీరో అల్లు అర్జున్ కూడా నిన్నటివరకు కామ్ గా ఉండడంతో మరోసారి మెగా-అల్లు అనుబంధంపై ఇండస్ట్రీలోనే కాదు అభిమానుల్లోనూ చర్చ మొదలైంది. నిన్న అల్లు అర్జున్ పెద్ది చిత్రాన్ని వీక్షించి పొగుడుతూ ట్వీట్ చెయ్యడం అభిమానులను శాంతపరిచింది.
ఈ వీకెండ్ తో డల్ మోడ్ లోకి వెళ్లిన పెద్ది అల్లు అర్జున్ ట్వీట తో మళ్ళీ ఏమైనా పుంజుకుంటుందా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ లోని ఏ ఒక్కరూ పెద్దిపై కామెంట్స్ చెయ్యకపోవడం పై మెగా ఫ్యాన్స్ లో అసహనం కనిపించేలా చేసింది.








































