Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raha Kapoor's cute presence at the birthday celebrations

బర్త్‌డే వేడుకల్లో రాహా కపూర్ క్యూట్ సందడి

Raha Kapoor's cute presence at the birthday celebrations

బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్  ముద్దుల కుమార్తె రాహా కపూర్ ఎక్కడ కనిపించినా ఆ ప్రాంతమంతా ప్రత్యేక ఆకర్షణగా మారిపోతుంది. సెలబ్రిటీల పిల్లల్లో రాహా కపూర్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా  వరుణ్ ధవన్ - నటాషా దలాల్ దంపతుల కుమార్తె లారా మొదటి పుట్టినరోజు వేడుకల్లో అలియా భట్  కుమార్తె రాహాతో కలిసి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.

ముంబైలో ఎంతో ఘనంగా జరిగిన ఈ బర్త్‌డే వేడుకకు సంబంధించిన ఓ వీడియో  సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అందులో అలియా భట్ తన చేతుల్లో రాహాను ఎత్తుకుని వేదిక వద్దకు వస్తుండగా మీడియా కెమెరాలు వారిని చుట్టుముట్టాయి. క్యూట్ ఫ్రాక్ ధరించి రెండు జడలతో పప్పీ లుక్‌లో ఉన్న రాహా కపూర్, అక్కడి వాతావరణాన్ని చూస్తూ ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నాయి.

ఈ బర్త్‌డే పార్టీకి అలియా భట్ ఎంతో సింపుల్  స్టైలిష్ క్యాజువల్ దుస్తులలో హాజరవగా.. చిన్నారి రాహా మాత్రం పార్టీలో ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఫోటోగ్రాఫర్లను చూసి రాహా ఎంతో అమాయకంగా.. ఆశ్చర్యంగా చూస్తున్న విజువల్స్ నెటిజన్లను  ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో చూసిన అభిమానులు `అచ్చం తండ్రి రణ్‌బీర్ కపూర్‌లాగే ఉంది` అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Raha Kapoor