Advertisementt

మండే ఎండ‌ల్లో మంటెక్కించే అప్ డేట్స్ !

Tue 21st Apr 2026 09:35 AM
ntr  మండే ఎండ‌ల్లో మంటెక్కించే అప్ డేట్స్ !
NTR Birthday update arriving మండే ఎండ‌ల్లో మంటెక్కించే అప్ డేట్స్ !
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు మే 20వ తేదీ  పండగ లాంటిది. ఈ నేప‌థ్యంలో తార‌క్ పుట్టినరోజు సందర్భంగా ప్రకంపనలు సృష్టించే భారీ అనౌన్స్‌మెంట్‌లు రాబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `డ్రాగన్` (వర్కింగ్ టైటిల్) కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఆరోజు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేయగా గ్లింప్స్ తో ఆ అంచనాలు మరో స్థాయికి చేరుతాయని భావిస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  కాంబినేషన్‌లో రాబోయే కొత్త ప్రాజెక్ట్ గురించిన స్పష్టత కూడా అదే రోజు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు షణ్ముఖుడు లేదా `గాడ్ ఆఫ్ వార్` అనే పవర్ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లార్డ్ కార్తికేయ నేపథ్యంలో సాగే ఈ పౌరాణిక/యాక్షన్ డ్రామాకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్ , ఎన్టీఆర్ నటన కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ రెండు భారీ అప్‌డేట్స్ మాత్రమే కాకుండా `దేవర 2` సినిమా స్థితిగతులపై కూడా కొరటాల శివ బృందం  క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతోన్న ఎన్టీఆర్ ఈ వేసవి ఎండల కంటే తీవ్రమైన సెగను తన సినిమా అప్‌డేట్స్‌తో పుట్టించబోతున్నారని అర్థమవుతోంది. మే 20న రాబోయే ఈ ప్రకటనలు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

NTR Birthday update arriving:

Young Tiger NTR Birthday update arriving

Tags:   NTR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ