బాలీవుడ్ సీనియర్ నటుడు రాకేష్ బేడీ కెరీర్ ప్రారంభ రోజులకు సంబంధించిన కొన్ని సరదా ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో శిక్షణ పొందుతున్న సమయంలో, తాను , తన స్నేహితుడు ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఇంటికి తరచుగా ఎందుకు వెళ్లేవారో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. ఆ రోజుల్లో ఉచిత భోజనం, మద్యం కోసం తామంతా జావేద్ అక్తర్ ఆశ్రయాన్ని వెతుక్కుంటూ వెళ్లేవాళ్లమని అన్నారు.
రాకేష్ బేడీ తనతో పాటు ఆనాటి స్నేహితులైన ఫరూక్ షేక్, నీనా గుప్తా వంటి నటులను కూడా ప్రస్తావించారు. అప్పట్లో వారంతా కెరీర్ కోసం పోరాడుతున్న సమయం కావడంతో, సరైన భోజనం దొరకడమే కష్టంగా ఉండేదట. అలాంటి సమయంలో జావేద్ అక్తర్ ఇల్లు వారికి ఒక పెద్ద దిక్కులా ఉండేదని గుర్తు చేసుకున్నారు. జావేద్ అక్తర్ చాలా ఉదార స్వభావం కలవారని తన ఇంటికి వచ్చే యువ నటులకు ఎప్పుడూ భోజనం, మద్యం ఏర్పాటు చేయడంలో వెనుకాడేవారు కాదని రాకేష్ బేడీ కొనియాడారు.
తిండి కోసమే కాకుండా అక్కడ జరిగే మేధోమథనం , సాహిత్య పరమైన చర్చలు కూడా తమను ఎంతో ఆకర్షించేవని తెలిపారు. జావేద్ అక్తర్ వంటి దిగ్గజాల సమక్షంలో గడపడం వల్ల సినిమా ప్రపంచం పట్ల తమ అవగాహన పెరిగిందని, అయితే ప్రాథమిక అవసరాల కోసం వెళ్లడం అనేది ఆ వయసులో ఒక మధురమైన జ్ఞాపకమని చెప్పుకొచ్చారు. నేడు అందరూ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఆనాటి కష్టాలు , సరదా స్నేహాలే తమను ఇప్పటికీ కలిపి ఉంచుతున్నాయని అభిప్రాయపడ్డారు.




ధురంధర్ ని ఫాలో అయితే బెటర్ 
Loading..