బాలయ్య అప్ డేట్స్ ఓకే మరి మోక్షు పరిస్థితి
Nandamuri Fans curious On Mokshagna Debut
నందమూరి బాలకృష్ణ బర్త్ డే కి ఇంకా మూడు రోజులే సమయం ఉంది. అప్పుడే NBK బర్త్ డే సెలెబ్రేషన్స్ మొదలైపోయాయి. ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న NBK 111 చిత్రం నుంచి అదిరిపోయే అప్ డేట్ రాబోతుంది. ఆ విషయం నందమూరి అభిమానులు ఫుల్ ఖుషినే.
కానీ ఒక్క విషయంలో నందమూరి అభిమానుల్లో అసంతృప్తి కనిపిస్తుంది. అదే నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ సినీ తెరంగేట్రంపై జరుగుతున్న చర్చ మరే వారసుడు విషయంలోనూ జరగలేదు. మోక్షజ్ఞ ఖచ్చితంగా హీరో అవుతాడు. అందుకు తగిన ట్రాన్స్ఫర్మేషన్ కూడా అయ్యింది.
మొదటి చిత్ర ఎనౌన్సమెంట్ పోస్టర్ కూడా వచ్చింది. కానీ అది సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆతర్వాత మరో సినిమా ప్రకటించనూ లేదు. మోక్షజ్ఞ మొదటి సినిమా అనౌన్సమెంట్ వచ్చి అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. కానీ మోక్షు తెరంగేట్రం ఇంతవరకు జరగలేదు. అదే అభిమానులు అడిగేది కూడా. మరా ముహూర్తం ఎప్పుడు వస్తుందో చూడాలి.






































