Advertisementt

దీపికా ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పరిస్థితి

Sun 19th Apr 2026 07:57 PM
deepika padukone  దీపికా ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పరిస్థితి
Deepika Padukone announces second pregnancy దీపికా ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పరిస్థితి
Advertisement
Ads by CJ

2024 లో ఓ పాప కు జన్మనిచ్చిన బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం తను ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ తో బిజీగా వుంది. ముఖ్యంగా అట్లీ-అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతున్న రాకా చిత్రంలో దీపికా మెయిన్ హీరోయిన్. అంతేకాదు దీపికా పదుకొనే ఒప్పుకున్న ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ఇలాంటి సమయంలో దీపికా పదుకొనె రెండోసారి ప్రెగ్నెన్సీ విషయాన్ని దీపికా-రణ్వీర్ సింగ్ లు అనౌన్స్ చెయ్యడం వాళ్ళ అభిమానులకు ఆనందమే అయినప్పటికీ.. ఆమె ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏమిటో అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. నిజమే క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ షూటింగ్ మధ్యలో ఉండగా ప్రెగ్నెన్సీ అంటే ఆ సినిమాల షూటింగ్స్ పరిస్థితి ఏమిటో కదా..

అయితే ప్రస్తుతం దీపికా ప్రెగ్నెన్సీ ఇంకా ఆరంభంలో ఉంది కాబట్టి ఆమెకు సంబందించిన సీన్స్ ని దర్శకుడు అట్లీ ముందు పూర్తి చేస్తారేమో చూడాలి. ఇక కల్కి 2 నుచి దీపికా ని మేకర్స్ తొలగించారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ లో మరో హీరోయిన్ వస్తుంది. 

Deepika Padukone announces second pregnancy:

Deepika Padukone and Ranveer Singh announce second pregnancy 

Tags:   DEEPIKA PADUKONE
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ