చరణ్ నమ్మాడు అంతే

Ram Charan Peddi social media talk


నిజమే రామ్ చరణ్ కథలను సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు చెయ్యడం లేదు. దర్శకులను గుడ్డిగా నమ్మి చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట. గేమ్ చేంజర్ అప్పుడు దర్శకుడు శంకర్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయినా చరణ్ కు ఆ చిత్రం నిరాశపరిచే ఫలితాన్నిచ్చింది.

ఆతర్వాత ఆచార్య లో గెస్ట్ రోల్ అంటూ ఫుల్ లెంత్ రోల్ చేసారు చరణ్. అక్కడా కొరటాల శివ చెప్పింది చేసారు. ఆ చిత్రం కూడా డిజాస్టర్. ఇక పెద్ది కథ ను నమ్మి బుచ్చి బాబు ఏం చెబితే అది చేసాడు. దాని కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో అనేది పెద్ది స్క్రీన్ పై చూస్తే తెలుస్తుంది. పెద్ది సినిమా చూసాక అందులో చరణ్ తప్పులేదు.

దర్శకుడిని నమ్మాడు, దర్శకుడు చెప్పింది చేసాడు. ఎంతో కఠోర శ్రమ పడ్డాడు. పహిల్వాన్ గా, క్రికెటర్ గా ఎంతో కష్టపడ్డాడు. కానీ బుచ్చి బాబు మాత్రం చరణ్ ని కరెస్ట్ గా వాడుకోలేకపోయాడు. రామ్ చరణ్ లాంటి హీరో డేట్స్ ఇస్తే...చరిత్ర తిరగరాసే సినిమా తియ్యాలి గానీ.. ఇలా.. ఇటు గాని.. అటు గాని..సినిమా చేస్తాడా..

రామ్ చరణ్ కఠోర శ్రమ అద్భుతం, ఆయన పడ్డ కష్టాన్ని తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీరు లాగా చేసిన ఈ దర్శకుడు, ఇప్పుడు ఏమి సినిమాలు లేవు కాబట్టి.. పైగా సెలవులు కాబట్టి.. కొంతలో కొంత అయినా పెద్ది సేవ్ అవుతుంది. లేదంటే పెద్ది కూడా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్న్ కామెంట్స్ చేస్తున్నారు.

Ram Charan Peddi public talk