ఎన్టీఆర్ ఏంటీ అల్లరి

NTR delights his fan with his wit

 

హీరోల్లో హైపర్ యాక్టీవ్ ఎవరు అని జక్కన్నను అడిగితే రవితేజ, ఎన్టీఆర్ పేర్లే పలు సందర్భాల్లో చెప్పారాయన. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా యాక్టీవ్ గా అల్లరిగా ఉంటారు. అంతేకాదు ఆయన చాలా చిలిపి అనేది ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ అప్పడు జక్కన్న, రామ్ చరణ్ లను ఆటపట్టించినప్పుడే చూసాం.

ఇక ఎన్టీఆర్ చాలా మంచి కుక్. ఆయన బిగ్ బాస్ లాంటి షో లో మటన్ బిర్యానీ చేసి అందరిని ఆశ్చర్యపరచడమే కాదు ఆయన అన్న కళ్యాణ్ రామ్ పలు సందర్భాల్లో తమ్ముడు తారక్ వంట గురించి చెప్పారు. ఎన్టీఆర్ కూడా స్ట్రెస్ తగ్గాలంటే కిచెన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు.

తాజాగా ఎన్టీఆర్ ఓవెన్ లో కుకీలు ట్రై చేశారు. ఆ కుకీస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వీటిని బయట కొనలేదని, తనే తొలిసారి ట్రై చేసి, బేక్ చేసి తయారుచేశానని ఎన్టీఆర్ చెప్పారు. దానికి ఆయన అభిమానులు రకరాలుగా స్పందించడం ఒక ఎత్తైతే.. ఓ అభిమాని మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, తనకు కుకీస్ పంపించమని అడిగారు.

దానికి ఎన్టీఆర్ సరదాగా ఆటపట్టిస్తూ బ్రహ్మి వీడియోస్ షేర్ చేస్తూ అడ్రస్ పెట్టు, మారాయ్  అన్నీ మారాయ్ అంటూ బాద్ షా లోని బ్రహ్మి వీడియో ని షేర్ చెయ్యడమే కాదు ఆ అభిమానికి ఎన్టీఆర్ కుకీస్ పంపించడం హాట్ టాపిక్ అయ్యింది.

Young Tiger surprises with his interaction