జూన్ మెరుపులు స్టార్ట్
June Lightning Starts for Tollywood
జనవరిలో సంక్రాంతి కి విడుదలైన సినిమాల్లో రాజా సాబ్, భర్త మహాశయులకు తప్ప మిగతా సినిమాలన్నీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. ఆతర్వాత ఆ రేంజ్ హిట్స్, ఆ రేంజ్ లో ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లిన సందర్భాలు వేళ్లల్లో లెక్కబెట్టడానికి కూడా లేవు. మళ్ళీ ఇన్నాళ్లకు అంటే మే చివరి తర్వాత జూన్ మొదలయ్యాక థియేటర్స్ లో పెద్ది చిత్రంతో మెరుపులు స్టార్ట్ అయ్యాయి.
జూన్ 4 న విడుదలైన పెద్ది థియేటర్స్ లో ఆడియన్స్ కిలకిలలు చూసాక మళ్లీ థియేటర్స్ ఊపిరి పోసుకున్నాయనిపిస్తుంది. ఏప్రిల్, మే అన్ని వారాలు థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు లేక ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి. పెద్ది వచ్చింది పరిస్థితిని మార్చేసింది. జూన్ ఫస్ట్ వీక్ మొత్తం మారిపోయింది.
ఇక జూన్ 19 న రాబోయే సమంత మా ఇంటి బంగారం పై ఆడియన్స్ హోప్స్ మొదలయ్యాయి. ఆతర్వాత వారం జూన్ 26 న రాబోయే లెనిన్ పై మరిన్ని ఆశలు పెట్టుకుంటున్నారు. లెనిన్ హిట్ అవుతుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ చూస్తున్నాం. సో ఈ జూన్ లో పెద్ది తో మెరుపులు స్టార్ట్ అయ్యి లెనిన్ తో ఎండ్ అవ్వడం అయితే గ్యారెంటీ.







































