Advertisementt

ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయిన బ్యాండ్ మేళం

Fri 17th Apr 2026 06:54 PM
band melam  ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయిన బ్యాండ్ మేళం
Band Melam Set to Premiere on Telugu ZEE5 ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయిన బ్యాండ్ మేళం
Advertisement
Ads by CJ

రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న బ్యాండ్ మేళం చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ఏప్రిల్ 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కోర్ట్ చిత్రంతో మెప్పించిన హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవి అప‌ల్ల‌ జంట ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా న‌టించారు.

బ్యాండ్ మేళం సినిమాను అంద‌మైన గ్రామీణ నేప‌థ్య చిత్రంగా రూపొందించారు. చిన్న‌నాటి నుంచి గిరి(హ‌ర్ష్ రోష‌న్‌), రాజి(శ్రీదేవి అప‌ల్ల‌) స్నేహంతో క‌లిసి పెరుగుతారు. క్ర‌మంగా వారి మ‌ధ్య స్నేహం ప్రేమ‌గా మారుతుంది. కొన్ని ప‌రిస్థితుల్లో గిరి ఓ లోక‌ల్ మ్యూజికల్ బ్యాండ్‌ను ప్రారంభిస్తాడు. ఈ క‌థ‌లో సంస్కృతి, సంప్ర‌దాయం, సంగీతం వంటి అంశాల‌ను క‌ల‌గ‌లిపి మారుతున్న సామాజిక ప‌రిస్థితుల్లో ప్రేమ‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌నే విష‌యాన్ని హృద్యంగా చూపించారు.

మట్టివాసనతో కూడిన కథనం, హృదయాన్ని తాకే భావోద్వేగాలతో ‘బ్యాండ్ మేళం’ సినిమా ప్రాంతీయ కథలను ఆవిష్కరించే జీ5 తెలుగు ఒరిజినల్స్, ప్రీమియర్ల జాబితాలో మరో చ‌క్క‌టి చిత్రంగా చేరుతోంది.

Band Melam Set to Premiere on Telugu ZEE5 :

Band Melam Set to Premiere on Telugu ZEE5 from April 24

Tags:   BAND MELAM
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ