తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన హన్సిక తన స్నేహితురాలు మాజీ భర్త సొహెల్ కతురియా ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహమైన చాలా తక్కువ కాలంలోనే భార్య భర్తలకు నడుమ విభేదాలు తలెత్తడంతో విడివిడిగా ఉంటూ విడాకులకు అప్లై చేసారు.
గత నెల మార్చి లో హన్సికకు-సొహెల్ కతురియా కు ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకులయ్యాక చాలా సైలెంట్ గా ఉన్న హన్సిక తాజాగా విడాకుల విషయంలో మొట్ట మోదటిసారి రియాక్ట్ అయ్యింది. జనాలకు కావాల్సింది హెడ్ లైన్స్, క్లిక్ బైట్స్. అవి వచ్చేసాయి, నేను మొదటి నుంచి ఏ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇవ్వను కూడా.
ఇందులో(డివోర్స్ విషయంలో) నాకు ఎలాంటి బాధ కానీ లేదు. మనం తప్పు ట్రైన్ ఎక్కామని తెలిసినప్పుడు అది దిగిపోవడమే మంచిది. ప్రస్తుతం నేను ఎలాంటి డిప్రెషన్ లో లేను, బాగానే ఉన్నాను. నా పర్సనల్ లైఫ్ పై ప్రజల అభిప్రాయాల కంటే నా హెల్త్, శ్రేయస్సే ముఖ్యం. విడాకులు, దానికి కారణాలు పూర్తిగా వ్యక్తిగతం.
అవి మా మధ్యే ఉండాలి. ఈ కష్ట సమయంలో నా తల్లి, సోదరుడు నాకు అండగా నిలిచారు. విడాకులు తర్వాత మనశ్శాంతి కోసం జపాన్ వెళ్లొచ్చాను, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను అంటూ హన్సిక విడాకుల విషయంపై మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం హైలెట్ అయ్యింది.




పూరి సినిమాకి ఓటీటీ టెన్షన్
Loading..