ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Peddi Makers Face Heat Over Objectification Of Janhvi Kapoor

జాన్వీ కపూర్ పాత్ర చిత్రణపై అభ్యంతరం!

Peddi Makers Face Heat Over Objectification Of Janhvi Kapoor

 

చిత్ర పరిశ్రమలో కమర్షియల్ హంగుల పేరుతో మహిళా పాత్రలను మితిమీరిన అంగాంగ ప్రదర్శనకు గురిచేసే ధోరణిపై ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌స్తూనే ఉంటాయి.  తాజాగా  ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `పెద్ది`  ఈ వివాదంలోకి వచ్చింది. ఈ చిత్రంలో కథానాయిక జాన్వీ కపూర్ పాత్రను ప్రదర్శించిన తీరుపై  సింగర్ సుమంగలి ఆరియనాయగం సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిత్ర మేకర్స్ అనుసరించిన ధోరణిని  బహిరంగంగానే తప్పుబట్టారు.`పెద్ది` చిత్రంలో మహిళా పాత్రలను మరింత గౌరవప్రదంగా చూపించాల్సింది.

దానికి భిన్నంగా జాన్వీ కపూర్ పాత్రను   గ్లామర్ ఆకర్షణ కోసమే అన్నట్లుగా.. అతిగా ప్రదర్శించడం  సరికాదని  ఘాటుగా విమర్శించారు.  ప్రమోషనల్ కంటెంట్‌లో ఇలాంటి ధోరణిని అనుసరించడం మేకర్స్  సృజనాత్మక లోపాన్ని సూచిస్తుందని  అభిప్రాయపడ్డారు. సాధారణంగా పెద్ద స్టార్ హీరోల సినిమాలలో కమర్షియల్ ఎలిమెంట్స్ మరియు గ్లామర్ జోడించడం బాక్సాఫీస్ అవసరంగా భావిస్తుంటారు. అయితే కథకు సంబంధం లేకుండా కేవలం మహిళా శరీరాకృతిని హైలైట్ చేస్తూ సీన్లు .. పాటలు రూపకల్పన చేయడం నేటి ఆధునిక సినీ యుగంలో సరికాదనే చర్చను సుమంగలి లేవనెత్తారు.

ముఖ్యంగా నారీ శక్తి -క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలలో కూడా ఇలాంటి  పాతకాలపు కమర్షియల్ ఫార్ములాలను ఉపయోగించడం పట్ల  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే  ఈ వివాదంపై సినీ విశ్లేషకులు - నెటిజన్ల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సుమంగలి చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు నిజమని సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగా మార్చే సంస్కృతికి స్వస్తి పలకాలని ఒక వర్గం మద్దతు ఇస్తోంది. 

Janhvi Kapoor’s character in Peddi sparks backlash, viewers call it objectifying