ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Peddi celebrity premiere at Mythri Vimal

పెద్ది : అక్కడికి సెలెబ్రిటీస్ క్యూ

Peddi celebrity premiere at Mythri Vimal

 

ఈరోజు బుధవారం రాత్రి 8 గంటలకు అటు ఏపీ ఇటు తెలంగాణ థియేటర్స్ లో పెద్ది ప్రీమియర్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టారు మేకర్స్. పెద్ది ని చూసేందుకు అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టడం అనేది తెలిసిన విషయమే. కానీ పెద్ది ని చూసేందుకు సెలబ్రిటీస్ పెద్ది ప్రీమియర్స్ కి వెళ్లడమే హాట్ టాపిక్.

హైదరాబాద్ లో మహెష్ బాబు #AMB కి రాజమౌళి అండ్ ఫ్యామిలీ, కొరటాల శివ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ పెద్ది ని వీక్షించేందుకు వెళితే.. హైదరాబాద్ బాలానగర్ విమల్ థియేటర్ కి రామ్ చరణ్ చరణ్ భార్య ఉపాసన, సుకుమార్ ఫ్యామిలీ, అలాగే మరికొంతమంది దర్శకులు, నటులు వెళ్లడం హైలెట్ అయ్యింది.

సో పెద్ది కోసం సెలబ్రిటీస్ కూడాఎంతగా వెయిట్ చేస్తున్నారో అనేది పెద్ది ప్రీమియర్స్ కి సెలబ్రిటీస్ వెళ్లిన తీరు చూస్తే తెలుస్తుంది. 

Celebrities at Peddi Premiere