Advertisementt

మెగా హీరోకి గాయం - మైనర్ సర్జరీ

Wed 15th Apr 2026 03:47 PM
varun tej  మెగా హీరోకి గాయం - మైనర్ సర్జరీ
Varun Tej injured during volleyball practice మెగా హీరోకి గాయం - మైనర్ సర్జరీ
Advertisement
Ads by CJ

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు చిత్రాన్ని ఫినిష్ చేసేసి తన సిస్టర్ మెగా ప్రొడ్యూసర్ నిహారిక నిర్మాతగా మొదలు కాబోతున్న బరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఆ క్రమంలోనే బరి చిత్రం కోసం వరుణ్ తేజ్ వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ కాలికి తీవ్ర గాయమైంది. 

దానితో వెంటనే వరుణ్ తేజ్ ను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ఈ రోజు ఆయనకు మైనర్ సర్జరీ జరగనుంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న బరి చిత్రం రీసెంట్ గానే పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్‌గా సహజంగా కనిపించేందుకు వరుణ్ తేజ్ గత కొద్దిరోజులుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.

వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగానే వరుణ్ తేజ్ కి గాయమవగా.. డాక్టర్స్ ఆయనకి చిన్న సర్జరీ చేసి తర్వాత కొద్దివారాల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించినట్లుగా తెలుస్తుంది. కాలు పూర్తిగా నయమయ్యాకే మళ్లీ షూటింగ్‌లో అడుగుపెడతారని తెలుస్తుంది. 

Varun Tej injured during volleyball practice:

Minor Surgery For Varun Tej

Tags:   VARUN TEJ
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ