పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్
సీనియర్లకు గౌరవం... కొత్తవారికి అవకాశాలు...సామాజిక కోణం కోణంలో నూతన కమిటీల కూర్పు
విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చిన అధిష్టానం
నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం
•> పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు.... ప్రతి కమిటీలోను నూతనత్వం
•> 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ కూర్పు.
•> జాతీయ ప్రధాన కార్యదర్శులు-3, జాతీయ ఉపాధ్యక్షులు-18, జాతీయ అధికార ప్రతినిధులు-10
•> రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్ల-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77.
•> నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొరి చొప్పున నియామకం.
•> అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై కసరత్తు చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు.
•> గతానికి భిన్నంగా పార్టీ కమిటీల కూర్పును కొత్త పుంతలు తొక్కించిన ముఖ్యమంత్రి
•> గత కొంత కాలంగా చెబుతున్నట్టే పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట.
•> ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి
•> పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్న గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్.
•> రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ... 50 మంది మహిళలకు చోటు, పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం.
•> జనాభా దామాషా పద్దతిన, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు.
•> 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు స్థానం కల్పించిన టీడీపీ అధిష్టానం
•> బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిన చంద్రబాబు.
•> బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 3.8 శాతం, మైనార్టీలకు 7 శాంత చొప్పున కమిటీలో స్థానం కల్పించిన టీడీపీ అధినాయకత్వం.
•> 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లో విశ్లేషించి కమిటీల కూర్పు చేపట్టిన చంద్రబాబు
•> పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు.
•> నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33 శాతం మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేసిన చంద్రబాబు
•> గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్ద పీట వేస్తూ కమిటీల కూర్పు.





మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి - వెంకయ్య నాయుడు
Loading..