ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kasthuri Raja: Will Dhanush enter politics one day?

ధనుష్ కూడా విజయ్ లా చేయగలడా

Kasthuri Raja: Will Dhanush enter politics one day?

 

తమిళనాట పార్టీ పెట్టిన రెండేళ్లకే అభిమానుల అండతో అధికారంలోకి వచ్చి సీఎం కుర్చీని అధిష్టించిన కోలీవుడ్ స్టార్ విజయ్ ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యేలా చేసింది. కోలీవుడ్ హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్, అజిత్ కి ఉన్న అభిమానగణం మరే ఇతర హీరోలకు లేదు అంటే అతిశయోక్తి లేదు.

అదే విజయ్ కు బలంగా మారింది. మరి ఏ హీరో రాజకీయాల్లోకి వచ్చినా విజయ్ అంత పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వగలరా అనేది మాత్రం అనుమానమే. ఇలాంటి సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ గురించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ధనుష్ తండ్రి కస్తూరి రాజా ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న కస్తూరి రాజాను ఆయన కొడుకు ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించగా, ఆయన మాట్లాడుతూ.. ధనుష్ రాజకీయాల్లోకి రావమనే వార్తను పూర్తిగా కొట్టిపారేయలేమన్నారు. ఆ హక్కు ఎవరికైనా ఉంటుంది. ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా నా కుమారులు మాత్రమే కాదు, నా మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు అంటూ కాస్త ఇండైరెక్ట్ గానే ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన తండ్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమైనాయి.

Will Dhanush Enter Politics Someday? Father Kasthuri Raja