Advertisementt

పెద్ది డేట్ చేంజ్ అయినా నో టెన్షన్

Mon 13th Apr 2026 09:38 PM
peddi  పెద్ది డేట్ చేంజ్ అయినా నో టెన్షన్
Peddi Movie Release Update పెద్ది డేట్ చేంజ్ అయినా నో టెన్షన్
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా ఫిలిం పెద్ది చిత్రం ఏప్రిల్ 30 నుంచి పోస్ట్ పోన్ అనే విషయాన్ని అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్ వరకు అందరూ వెయిట్ చేస్తున్నారు. మరోపక్క ఏప్రిల్ 30 నుంచి పెద్ది రిలీజ్ పోస్ట్ పోన్ అయితే గనక పెద్ది ఓటీటీ డీల్ లో ఎంతోకొంత నష్టపోవాలని మాట్లాడుకుంటున్నారు.

కానీ పెద్ది ఏ తేదికి అంటే ఏప్రిల్ 30 నుంచి విడుదల తేదీ ఆలస్యమై జూన్ కి వెళ్లినా పెద్ది ఓటీటీ డీల్ విషయంలో సదరు సంస్థ ఎలాంటి కోత వెయ్యడం లేదట. పెద్ది ఎప్పుడు విడుదలైనా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ, పెద్ది కంటెంట్ అలాంటిది అంటూ పెద్ది డేట్ చేంజ్ అయినా ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు అంటున్నారు.

మరి బుచ్చి బాబు పెద్ది కి సంబందించిన అన్ని పనులు చక్కబెట్టేసి ప్రస్తుతం స్పెషల్ సాంగ్ పై ఫోకస్ పెట్టారట. అది కూడా పూర్తయితే ఏప్రిల్ 30 నుంచి జూన్ 4 లేదా జూన్ 25 కి సినిమా డేట్ లాక్ చేసి ప్రోపర్ ప్రమోషన్స్ లకి దిగుతారని తెలుస్తుంది. 

Peddi Movie Release Update:

Peddi Movie

Tags:   PEDDI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ