రష్మిక కెరీర్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్
Rashmika Gets Career's Highest Remuneration
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరస సినిమాల్తో టాప్ చైర్ కి దగ్గరైన రష్మిక సౌత్ లోనే కాదు బాలీవుడ్ లోను పాపులర్ అయ్యింది. అక్కడ క్రేజీ స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తుంది. యానిమల్, పుష్ప చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంది.
ఇప్పుడు షాహిద్ కపూర్ తో కలిసి కృతి సనన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న కాక్ టైల్ 2 తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి గాను రష్మిక మందన్న కెరీర్ లోనే హైయ్యెస్ట్ పారితోషికం అందుకున్నట్లుగా తెలుస్తుంది. కాక్ టైల్ 2 కి రశ్మికకు నిర్మాతలు ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారట.
అంతేకాకుండా కాక్ టైల్ 2 కోసం హీరో షాహిద్ కపూర్ రూ. 35 కోట్లు, కృతి సనన్ రూ. 14 కోట్లు అందుకున్నట్లుగా బాలీవుడ్ మీడియా టాక్. ప్రస్తుతం రష్మిక రెమ్యునరేషనే టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా నిలుస్తుంది.







































