స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నటి మృణాల్ ఠాకూర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నటన , ఆహార్యాన్ని చూ స్తుంటే అలనాటి దిగ్గజ నటి మధుబాల గుర్తుకొస్తుందని కొనియాడారు. మృణాల్‌లో ఉన్న సహజమైన అందం, క్లాసిక్ లుక్ ఆమెను ఇతర హీరోయిన్ల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుందని అభిప్రాయపడ్డారు.
అలాగే ఓ విలువైన సలహా కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ , ప్రతిభకు తగ్గట్టుగా మరింత మెరుగైన, సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకోవాలని కోరారు. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా తనలోని నటనను కొత్త కోణంలో ఆవిష్కరించే కథలపై దృష్టి పెట్టాలని సూచించారు. `డెకాయిట్` వంటి విభిన్నమైన ప్రాజెక్టు ద్వారా ఆమె తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
మృణాల్ ఠాకూర్ ఇప్పటికే `సీతా రామం` తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. నాగ్ అశ్విన్ వంటి విజనరీ దర్శకుడు ఆమెను మధుబాలతో పోల్చడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రశంసలు ఆమెకు మరిన్ని గొప్ప అవకాశాలను తెచ్చిపెడతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.





కాక పుట్టిస్తోన్న యంగ్ టైగర్ మస్కులర్ లుక్!

Loading..