ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> No Permission For Pawan's Telangana Meeting

పవన్ కు నో పర్మిషన్

No Permission For Pawan's Telangana Meeting


తెలంగాణ పై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ కూడా పార్టీ ని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహ రచనలు చేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలి లో జనసేన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం సభను నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చెయ్యాలని డిసైడ్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ సభకు తెలంగాణ పోలీసులు అనుమతులు నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ లో పవన్ జనసేన సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు.

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ సభకు అనుమతినివ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే అన్నిటికి ప్రిపేర్ గా ఉన్న జనసేన తెలంగాణ నేతలు తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం సభకు అనుమతినివ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు

No Permission For Janasena Sabha