పెద్ది పై హోప్స్ పెట్టుకోవద్దు

No Release Trailer for Peddi


పెద్ది రిలీజ్ ట్రైలర్ పై హోప్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే అసలు పెద్ది రిలీజ్ ట్రైలర్ రావడం లేదు.. ఇది లేటెస్ట్ న్యూస్. పెద్ది రిలీజ్ ట్రైలర్ ఈరోజు విజయవాడలో జరగబోయే పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వదులుతారనే ప్రచారం ఉన్నప్పటికి.. అలాంటిదేం లేదు అని తెలుస్తుంది.

మరి పెద్ది విడుదలకు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. ఎల్లుండి బుధవారం ఈపాటికి పెద్ది ప్రీమియర్స్ హడావిడిది ఓ రేంజ్ లో మొదలైపోతుంది. ఈరోజు విజయవాడ ఈవెంట్, రేపు హైదరాబాద్ ఈవెంట్ తో పెద్ది ప్రమోషన్స్ హడావిడి ముగుస్తుంది. అయితే మెగా ఫ్యాన్స్ కోరినట్టుగా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగా..

పెద్ది రిలీజ్ ట్రైలర్ అయితే రావడం లేదు అని పక్కా సమాచారం. మరి మెగా ఫ్యాన్స్ పెద్ది ట్రైలర్ పై వచ్చిన మిక్స్డ్ ఒపీనియన్ ని పెద్ది రిలీజ్ ట్రైలర్ తో పోగొట్టాలి బుచ్చి బాబు ని అడిగినా ఉపయోగం లేదు. అయినప్పటికి పెద్ది కి భారీ ఓపెనింగ్స్ రావడంమైతే ఖాయంగా కనిపిస్తుంది. చూద్దాం పెద్ది పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అనేది. 

No Release Trailer for Ram Charan's Peddi