Advertisementt

క్రికెట్ ఫీవర్ - సమ్మర్ సీజన్ స్కిప్

Mon 13th Apr 2026 11:54 AM
ipl  క్రికెట్ ఫీవర్ - సమ్మర్ సీజన్ స్కిప్
Cricket fever Tollywood Skips Summer Season క్రికెట్ ఫీవర్ - సమ్మర్ సీజన్ స్కిప్
Advertisement
Ads by CJ

తెలుగు సినీ పరిశ్రమలో వేసవి కాలం అంటే పెద్ద సినిమాల రిలీజ్ జాతర క‌నిపిస్తుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఐపీఎల్ సందడి ధాటికి స్టార్ హీరోలు సైతం బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు జంకుతున్నారు. సాధారణంగా వేసవి సెలవులను క్యాష్ చేసుకోవాలని చూసే నిర్మాతలు, ఈసారి క్రికెట్ ఫీవర్ వల్ల కలెక్షన్లకు గండి పడుతుందని భయపడుతున్నారు. సాయంత్రం వేళల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండటం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందనే ఆందోళనతో టాలీవుడ్ సమ్మర్ సీజన్‌ను దాదాపు స్కిప్ చేస్తోంది.

క్రికెట్ ప్రభావం కారణంగా ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులు విడుదల తేదీలను మార్చుకున్నాయి. నాని నటించిన `పారడైస్,  కన్నడ స్టార్ యష్ హీరోగా న‌టిస్తోన్న `టాక్సిక్` వంటి చిత్రాలు వేసవిలో రావాల్సి ఉన్నా?  ఇప్పుడు జూన్ నెలకు వాయిదా పడ్డాయి. అదేవిధంగా రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం `పెద్ది` కూడా వెనక్కి తగ్గింది. జూన్ కల్లా ఐపీఎల్ ముగిసిపోతుండటంతో? అప్పటి వరకు వేచి చూడటమే శ్రేయస్కరమని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో సమ్మర్ బాక్సాఫీస్ వెలవెలబోతుండగా? చిన్న సినిమాలకు మాత్రం ఇది కొంతవరకు కలిసొచ్చే అంశం.

స్టార్ హీరోలు ఇలా వెనక్కి తగ్గడం వెనుక కేవలం ఐపీఎల్ మాత్రమే కాకుండా భారీ బడ్జెట్ సినిమాల రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది. వందల కోట్ల బిజినెస్ జరిగే సినిమాలు ఏ చిన్న కారణం చేతనైనా కలెక్షన్లు కోల్పోతే ఆ ప్రభావం బయ్యర్లపై పడుతుంది. అందుకే రిస్క్ తీసుకోకుండా క్రికెట్ మేనియా తగ్గిన తర్వాతే సినిమాలను విడుదల చేయాలని నిర్మాతలు  అవగాహనకు వచ్చారు. ఫలితంగా ఈ ఏడాది సమ్మర్ అంతా టీవీల ముందు క్రికెట్ వినోదంతోనే గడిచిపోనుండగా?  థియేటర్లలో సందడి మాత్రం జూన్ నుండి మొదలుకానుంది.

Cricket fever Tollywood Skips Summer Season:

IPL fever Tollywood Skips skip the prime season

Tags:   IPL
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ