Advertisementt

టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా డ్రాగ‌న్ విల‌న్!

Mon 13th Apr 2026 11:43 AM
shahid kapoor  టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా డ్రాగ‌న్ విల‌న్!
Shahid Kapoor In NTR Dragon టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా డ్రాగ‌న్ విల‌న్!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ `డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) విలన్ పాత్రపై  కొత్త అప్ డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో తారక్‌ను ఢీకొట్టే అత్యంత శక్తివంతమైన ప్రతి నాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో షాహిద్ వంటి నటుడు తోడైతే బాక్సాఫీస్ వద్ద అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం.

నిజానికి ఈ పాత్ర కోసం తొలుత మలయాళ స్టార్ నటుడు తోవినో థామస్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే కాల్ షీట్ల సమస్యల కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ప్రశాంత్ నీల్  బాలీవుడ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో విలన్ పాత్రలు హీరోలకు ధీటుగా ఎంతో గంభీరంగా ఉంటాయి. `కబీర్ సింగ్` వంటి చిత్రాలతో తనలోని తీవ్రమైన నటనను నిరూపించుకున్న షాహిద్, ఎన్టీఆర్ మాస్ పవర్‌ను ఎదుర్కొనే విలన్‌గా సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారుట‌.

ప్రస్తుతం ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఒకవేళ షాహిద్ కపూర్  గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ఆయనకు నేరుగా టాలీవుడ్ అరంగేట్రం అవుతుంది. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ఉత్తరాది మార్కెట్‌లో కూడా సినిమాకు బలమైన క్రేజ్ రావాలంటే షాహిద్ వంటి స్టార్‌ను తీసుకోవడం వ్యూహాత్మకంగా కూడా కలిసి వచ్చే అంశం. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Shahid Kapoor In NTR Dragon:

Shahid Kapoor to replace Tovino Thomas in NTR–Neel film

Tags:   SHAHID KAPOOR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ