ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vignesh Shivan faces online backlash after emotional note

తనకి అన్యాయం జరిగిందంటున్న నయన్ భర్త

Vignesh Shivan faces online backlash after emotional note

 

దర్శకుడిగా తనకంటూ ఎలాంటి ప్రత్యేకతను చూపించలేకపోతున్న విగ్నేష్ శివన్ ని ఇప్పటికి లేడీ సూపర్ స్టార్ నయనతార భర్తగానే ట్రీట్ చేస్తున్నారు తప్ప ఆయన్ని గురించి ఎవరూ స్పెషల్ గా మాట్లాడుకోవడం లేదు. దర్శకుడిగా వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న విగ్నేష్ శివన రీసెంట్ మూవీ LIK కి థియేటర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూసారు.

అయితే తన సినిమా థియేటర్స్ లో ఆడకపోవడానికి కారణం రివ్యూ రైటర్స్ అని, తనకు వారి వల్లే అన్యాయం జరిగింది అని, తన LIK సినిమాని ఓటీటీ లో వీక్షించిన వారు అయ్యో మంచి సినిమాని థియేటర్స్ లో మిస్ అయ్యామే అని ఇపుడు బాధపడుతున్నారు అంటూ ఇన్స్టా లో తన బాధను వెళ్లగక్కుతూ పెద్ద నోట్ రిలీజ్ చేసాడు విగ్నేష్ శివన్.

మరి హ్యాట్రిక్ విజయాలతో ఉన్న ప్రదీప్ రంగనాధన్ కి ఫస్ట్ ప్లాప్ ఇచ్చిన విగ్నేష్ శివన్ ఇప్పుడు ఆ సినిమా పోవడానికి తన తప్పేమి లేదు. అంతా క్రిటిక్స్ చేసారు అంటూ నెపం వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. అంతెందుకు ఈమధ్యన వచ్చిన కరుప్పు, దృశ్యం 3, బ్లాస్ట్ జోన్ చిత్రాలకి రివ్యూ రైటర్స్ ఎలాంటి రేటింగ్స్ ఇచ్చారో, ఆ సినిమాలకి ఎంత అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయో అందరూ చూసారు.

కేవలం రివ్యూ రైటర్స్ రేటింగ్స్  ఇవ్వకపోవడం వల్లే సినిమా పోయింది అంటే అది నిజంగా హాస్యాస్పదం, చేతకాని తనమే అవుతుంది కానీ మరొకటి ఉండదు. మరి విగ్నేష్ శివన్ ఏమి ఆశించి నోట్ పెట్టాడో ఆయనకే తెలియాలి. 

Vignesh Shivan Reflects on LIK’s Box Office Fizzle