Advertisementt

మోనాలిసా పారిపోయిందంటూ భర్త వీడియో

Sun 12th Apr 2026 09:44 PM
monalisa  మోనాలిసా పారిపోయిందంటూ భర్త వీడియో
Monalisa goes missing after POCSO FIR against Farman మోనాలిసా పారిపోయిందంటూ భర్త వీడియో
Advertisement
Ads by CJ

కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన మోనాలిసా ఆతర్వాత సినిమా ఇండస్ట్రిలోకి ఎంటర్ అయ్యింది. అంతేకాదు ఆమె ఎంత త్వరగా ఫేమస్ అయ్యిందో అంతే స్పీడుగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుని షాకిచ్చింది. మోనాలిసా పెళ్లి కూడా మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

కేరళలో ఫర్మాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అయితే రీసెంట్ గా మోనాలిసా ఇంకా మేజర్ కాలేదు, ఆమె మైనర్, అందుకే ఆమె పెళ్లి చెల్లదు అంటూ భర్త ఫర్మాన్ పై ఫోక్సో కేసు నమోదు చేసారు పోలీసులు.

ఈలోపే మొనాలిసా పారిపోయింది అంటూ భర్త ఫర్మాన్ ఓ సంచలన వీడియో రిలీజ్ చేసాడు. నేను అజ్మీర్, పుష్కర్లలో ఉన్నాను. మోనాలిసా పారిపోయింది, ఆమెను వెతకడానికే నేను ఇక్కడికి వచ్చాను. మిత్రులారా, నాకు అజ్మీర్లో మోనాలిసా దొరకలేదు. ఆమెను వెతకడానికి నేను జోధ్పూర్ కు వెళ్తున్నాను. ఎవరికైనా తెలిస్తే దయచేసి నాకు తెలియజేయండి. అంటూ ఫర్మాన్ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఆ వీడియో చూసాక మోనాలిసా తల్లి లతాబాయి, ఆమె తండ్రి జైసింగ్ సలే ఆందోళన వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పెళ్లి మొత్తం ఒక కుట్ర అని అది తెలిసే మోనాలిసా ను ఫర్మాన్ మాయం చేసాడు అని వారు ఆరోపిస్తున్నారు.

Monalisa goes missing after POCSO FIR against Farman:

Viral Girl Monalisa Missing

Tags:   MONALISA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ