Advertisementt

మీడియాపై సింగర్ మంగ్లీ రుసరుస

Sun 12th Apr 2026 08:10 PM
mangli  మీడియాపై సింగర్ మంగ్లీ రుసరుస
Singer Mangli Press Meet మీడియాపై సింగర్ మంగ్లీ రుసరుస
Advertisement
Ads by CJ

నిన్న శనివారం సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడిపై సుబ్బారావు అనే లాయర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. జనం నుంచి డబ్బు వసూలు చేసి చీట్ చేసారు, అదేమని అడిగితే తనని చంపేస్తాను అని మంగ్లీ ఇంకా ఆమె సోదరుడు మరో ముగ్గురితో కలిసి బెదిరించారు, తనకు ప్రాణహాని ఉంది అంటూ లాయర్ సుబ్బారావు కంప్లైంట్ చేసారు.

కానీ సింగర్ మంగ్లీ ఆ లాయర్ సుబ్బారావ్ తనని హెరాస్ చేసాడు అంటూ రిటన్ లో అతనిపై నార్సింగి పీఎస్ లో కంప్లైంట్ చేసింది. ఈలోపు సింగర్ మంగ్లీ సోదరుడు డబ్బు కట్టలు లెక్కబెడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది చేసింది. ఆ విషయంపై తాజాగా మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టి మీడియాపై సెటైర్స్ వేసింది.

నాకు డబ్బుతో అస్సలు పని లేదు, నేను పాడిన పాటలే నన్ను బ్రతికిస్తున్నాయి. నా పాటలు విని ఎంతోమంది ఆశీర్వదిస్తున్నారు. నన్ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 2023 తెలంగాణాలో, 2024 ఏపీలో ఎన్నికల సమయంలో నాకు కోట్లు ఇస్తామని అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు, నాకు డబ్బులు అవసరం లేదు.

మీడియా వారే నన్ను బ్యాడ్ చేసారు అనగానే మీడియా వారు మంగ్లీ పై ఫైర్ అయ్యారు. నేను మిమ్మల్ని ఏమి అనడం లేదు. నా ప్రమేయం లేదు అని తెలిస్తే అతన్ని ఏంచేస్తారో నాకు మాటివ్వండి అంటూ మీడియానే ప్రశ్నించింది. తాను మీడియా ఫామిలీ నుంచి వచ్చాను అంటూనే సుబ్బారావు అనే వ్యక్తి ఫేమస్ అవ్వడానికి ఇలా చేస్తున్నాడు.

అతను నన్ను డిమాండ్ చేస్తున్నాడు, నీకు అంత నడమంత్రపు సిరి ఎందుకు, ఇంత సోకులెందుకు పడుతున్నావ్ అంటూ వల్గర్ గా మాట్లాడాడు అంటూ వీడియో ప్రూఫ్ చూపిస్తూనే తనకు వ్యతిరేకంగా వచ్చిన వార్తలు వెయ్యొద్దు అన్నట్లుగా మంగ్లీ మాట్లాడింది.

Singer Mangli Press Meet :

Singer Mangli Press Meet Over Cheating Case

Tags:   MANGLI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ