Advertisementt

జన నాయగన్ లీక్ తో మాకు సంబంధం లేదు

Sun 12th Apr 2026 03:09 PM
jana nayagan  జన నాయగన్ లీక్ తో మాకు సంబంధం లేదు
CBFC on Jana Nayagan leaks జన నాయగన్ లీక్ తో మాకు సంబంధం లేదు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన జన నాయగన్ చిత్రం లీకులు సోషల్ మీడియా ని కుదిపేశాయి. జన నాయగన్ నిర్మాతలు నిలువునా మునిగిపోయే సన్నివేశాలు సోషల్ మీడియాలో లీకై సంచలనం గా మారిన ఈ లీకులను అసలు ఎవరు చేసారు, ఎవరైనా కావాలని చేసారా అనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. నిర్మాతలు ఆ లీకుడు ఫుటేజ్ ని స్ప్రెడ్ చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

అయితే విజయ్ కావాలనే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు తను నటించిన జన నాయగన్ చిత్రంలోని ఫుటేజ్ లీక్ చేసి ఉంటాడని DMK పార్టీ ఆరోపించగా.. ఒకవేళ సెన్సార్ నుంచి ఈ వీడియో ఫుటేజ్ ఏమైనా లీకై ఉంటుందా అనే అనుమానాలకు సెన్సార్ బోర్డు క్లారిటీ ఇచ్చింది.

జన నాయగన్ సినిమా లీకేజీ వ్యవహారంలో తమ ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలను CBFC ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మహారాష్ట్ర అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సీబీఎఫ్‌సీ ఒక ప్రకటన విడుదల చేసింది.

జన నాయగన్ సినిమా డిజిటల్ సినిమా ప్యాకేజీ ని మార్చి 17నే ముంబైలో జన నాయగన్ నిర్మాతలకు తాము అప్పగించామని, అప్పటి నుంచి అది వారి వద్దే ఉందని CBFC తెలిపింది. సినిమా కంటెంట్ పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ అని, దానికి సంబంధించిన కీ డెలివరీ మెసేజ్ అన్ని కేవలం నిర్మాత వద్ద మాత్రమే ఉంటుందని వివరించింది. ఆ కీ లేకుండా సినిమాను చూడటం గానీ, యాక్సెస్ చేయడం గానీ సాధ్యం కాదని... సో ఈ లీక్ లతో తమకు సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది.

CBFC on Jana Nayagan leaks:

CBFC reacts on Jana Nayagan leaks 

Tags:   JANA NAYAGAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ