Advertisementt

బ్రేకింగ్ - సింగర్ ఆశా భోస్లే కన్నుమూత

Sun 12th Apr 2026 01:11 PM
asha bhosle  బ్రేకింగ్ - సింగర్ ఆశా భోస్లే కన్నుమూత
Asha Bhosle passes away బ్రేకింగ్ - సింగర్ ఆశా భోస్లే కన్నుమూత
Advertisement
Ads by CJ

మ్యూజిక్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) కన్నుమూత. నిన్న శనివారం రాత్రి హార్ట్ ఎటాక్ తో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆశా భోస్లే బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. లతా మంగేష్కర్ సోదరిగా మ్యూజిక్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆశా భోస్లే, ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో హిందీ, మరాఠీతో సహా పలు భాషల్లో వేలాది పాటలు పాడారు.

అనేక అవార్డులు రివార్డులు ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆశా భోస్లే, 

1950 వ దశకంలో బాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1952 లో సంగ్దిల్ చిత్రం తో గుర్తింపు సంపాదించుకున్నారు. పరిణితి, బూట్ పాలిష్ చిత్రాలతో అగ్ర దర్శకుల దృష్టి ని ఆకర్షించిన ఆశా.. 1970 దశకం లో పియా తు అబ్ తో ఆజా , దమ్ మారో దమ్ , చురా లియా హై తుమ్నే  పాటలు బాగా పాపులర్ అయ్యాయి 

మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన మాంగ్ కే సాథ్ తుమ్హారా, సాథీ హాత్ బధానా, ఉదేన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ వంటి పాటలు నేటికీ ఎవర్‌గ్రీన్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోస్లే పాడిన పాటలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ఆజా ఆజా, పియా తూ అబ్ తో ఆజా, యే మేరా దిల్ వంటి డ్యాన్స్ నంబర్లతో అప్పట్లోనే సంచలనం సృష్టించారు.

కమర్షియల్ పాటలకే పరిమితం కాకుండా గజల్స్ పాడి జాతీయ అవార్డులను సైతం అందుకున్న ఆశా భోస్లే , 90వ దశకంలో రంగీలా చిత్రంతో కుర్రకారును ఉర్రూతలూగించారు. సంగీత సామ్రాజ్ఞిగా కీర్తి పొందిన ఆశా భోస్లే హార్ట్ ఎటాక్ తో 92 వయసులో కన్నుమూసారు.

Asha Bhosle passes away:

Legendary singer Asha Bhosle passes away

Tags:   ASHA BHOSLE
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ