Advertisementt

బాలయ్య కమిట్మెంట్స్ - అభిమానుల ఆందోళన

Sun 12th Apr 2026 12:28 PM
balakrishna   బాలయ్య కమిట్మెంట్స్ - అభిమానుల ఆందోళన
Balayya Commitments - Fans Concerns బాలయ్య కమిట్మెంట్స్ - అభిమానుల ఆందోళన
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ లైనప్ చూస్తే ఆనందించాంల్సిన అభిమానులు ఆందోళనపడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో NBK 111 చేస్తున్న బాలయ్య తర్వాత తదుపరి చిత్రాన్ని అంటే ఆదిత్య 999 ని ఏ దర్శకుడితో చేస్తారో క్లారిటీ లేదు కానీ.. ఈలోపు ఎలాంటి బ్లాక్ బస్టర్స్ లేని దర్శకులకు బాలయ్య కమిట్ అవడమే అభిమానుల ఆందోళనకు అసలు కారణం.

అందులో వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల ఉన్నారు. ఈ ఇద్దరు దర్శకుల్లో ఏ ఒక్కరికి బ్లాక్ బస్టర్ బ్యాగ్రౌండ్ లేదు. సరిపోదా శనివారం తో వివేక్ ఆత్రేయ హిట్ కొట్టినా అది సూపర్ హిట్ కాదు. అలాగే విజయ్ కనకమేడల నాంది తో సత్తా చాటిన తర్వాత చేసిన ఉగ్రం అలాగే భైరవం చిత్రాలు అనుకున్న రేంజ్ హిట్ అవ్వలేదు.

అలాంటి దర్శకులకు బాలయ్య ఛాన్స్ ఇవ్వడమనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ నందమూరి అభిమానులు టెన్షన్. మరి ఆ ఇద్దరు దర్శకులు బాలయ్య కు ఏం చెప్పి ఒప్పించారో తెలియదు కానీ.. అటు వివేక్ ఆత్రేయ, ఇటు విజయ్ కనకమేడల ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నారు.

Balayya Commitments - Fans Concerns:

Nandamuri Balakrishna lineup

Tags:   BALAKRISHNA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ