Advertisementt

న్యాయవాదిపై సింగర్ మంగ్లీ రివర్స్ కేసు

Sat 11th Apr 2026 05:35 PM
singer mangli  న్యాయవాదిపై సింగర్ మంగ్లీ రివర్స్ కేసు
Singer Mangli reverse case against Lawyer Subbarao న్యాయవాదిపై సింగర్ మంగ్లీ రివర్స్ కేసు
Advertisement
Ads by CJ

సుబ్బారావు అనే న్యాయవాది సింగర్ మంగ్లీ అలాగే ఆమె సోదరుడు, దర్శకుడు వేణు లపై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేసాడు. మంగ్లీ ఆమె సోదరుడు, వేణు ఇంకొంతమంది తనని అలాగే చాలామందిని వ్యాపారం పేరుతొ డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోగా తనను చంపేస్తానని బెదిరిస్తున్నారు అని, తనకి ప్రాణ హాని ఉంది అంటూ సుబ్బారావు పోలీస్ లకు కంప్లైంట్ చేశారు. 

తాజాగా సుబ్బారావుపై రివర్స్ లో నార్సింగి పీఎస్ లో ఫిర్యాదు చేసింది సింగర్ మంగ్లీ.. 150 కోట్ల మోసం చేశారంటూ తనపై  సుబ్బారావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మార్చి 21 న సుబ్బారావు పేరుతో తనను పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించాడని, అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని, తనను కలవాలని ఒత్తిడి చేసినట్టు, నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించినట్లు మంగ్లీ ఫిర్యాదులో పేర్కొంది. 

అంతేకాకుండా మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణ చేయడమే కాదు, తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారని, సుబ్బారావు తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగ్లీ పోలీసులను విజ్ఞప్తి చేసింది. 

Singer Mangli reverse case against Lawyer Subbarao:

Singer Mangli 

Tags:   SINGER MANGLI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ