Advertisementt

ఉస్తాద్‌ నష్టాలు పూడ్చేదెలా

Sat 11th Apr 2026 05:26 PM
pawan  ఉస్తాద్‌ నష్టాలు పూడ్చేదెలా
Ustaad Bhagat Singh ఉస్తాద్‌ నష్టాలు పూడ్చేదెలా
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే నిర్మాతలు పచ్చిగా మాట్లాడాలి అంటే నట్టేట మునుగుతున్నారు. గత ఏడాది వచ్చిన హరి హర వీరమల్లు, OG చిత్రాల నిర్మాతలు నెత్తిన చెంగేసుకున్నారు. OG హిట్ అన్నా దానయ్య నష్టాల బారిన పడ్డారు. ఇప్పుడు ఇక ఉస్తాద్ భగత్ సింగ్ వంతు. భారీ అంచనాలు నడుమ విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ రావడం కన్నా ధురంధర్ 2 దెబ్బ మాములుగా తగల్లేదు.

ఫస్ట్ వీకెండ్ కె ఉస్తాద్ భగత్ సింగ్ చేతులెత్తేసింది. పవన్ స్టామినా ఉస్తాద్ ని కాపాడలేకపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యాక సినిమాలపై మనసు పెట్టడం లేదు. లేదంటే అవుట్ ఫుట్ అలా ఉండదు. ఆయనిచ్చిన డేట్స్ లో షూటింగ్ హరిబరిగా చేస్తున్నారు దర్శకులు. 

ఏళ్ళ తరబడి సెట్ పై సినిమాలు ఉంటే.. ఆ సినిమా సెట్స్ కి అయ్యే నిర్మాణ ఖర్చులు అన్ని నిర్మాతలకు తలకు మించిన భారమే అవుతాయి. పవన్ సినిమా యావరేజ్ అయినా కలెక్షన్స్ భారీగా వచ్చేవి. కానీ ఇప్పుడు సినిమా యావరేజ్ అంటే డిజాస్టర్ కలెక్షన్స్ వస్తున్నాయి.

మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ టాక్ ప్రభావం ఉస్తాద్ భగత్ సింగ్ కనీసం రూ.100 కోట్ల క్లబ్బులోకి చేరుకోకపోవడం గమనార్హం. ఉస్తాద్ నష్టాలు చూసాక పవన్ స్టామినా తగ్గుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కి దగ్గరైంది. 

Ustaad Bhagat Singh:

Ustaad Bhagat Singh - Pawan Kalyan

Tags:   PAWAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ