ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Balakrishna daughter surprises with her dance moves

బాలయ్య చిన్న కుమార్తె డాన్స్ టాలెంట్

Balakrishna daughter surprises with her dance movesBalakrishna daughter surprises with her dance moves


నందమూరి నటసింహ బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా తండ్రి బాలయ్య చేసే సినిమాలు, ఆయన స్టైలింగ్, ఇంకా నిర్మాతగా కనిపిస్తుంది. సినిమా ఈవెంట్స్ లోను తేజస్విని యాక్టీవ్ గా కనిపిస్తుంది. ఏంతో అందమైన కుమార్తెలైన బ్రాహ్మణి, తేజస్వినిలను బాలయ్య సినిమా ఇండస్ట్రీ కి దూరం గానే పెంచారు. బ్రాహ్మణి, తేజస్విని హీరోయిన్స్ కి ఏమి తీసిపోరు.

తెర వెనుకే కాదు ఓ జ్యువెలరీ యాడ్ లోను తేజస్విని మెరిసింది కూడా. తాజాగా తేజస్విని తన డ్యాన్స్ టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ పాపులర్ సాంగ్ తేజస్విని ఎంతో హుషారుగా స్టెప్పులు వేసింది. ఫేస్ లో హావభావాలు పలికిస్తూ తేజస్విని వేసిన డాన్స్ స్టెప్స్ కి నందమూరి అభిమానులైతే మైమరిచిపోతున్నారు.

తెరమీద కనిపించేందుకు ఇష్టపడని తేజస్వినిలోని ఈ టాలెంట్ ని చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. తేజస్విని హుషారైన డ్యాన్స్ చూడముచ్చటగా ఉందంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 

Balakrishna daughter showcases her dancing talent