అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం
Ajith mother Mohini Mani (85) passes away
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అజిత్ తల్లి మోహిని మణి ఈ రోజు శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియడంతో అజిత్ అభిమానులతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది
అజిత్ తల్లి మోహిని మణి వయసు 84 సంవత్సరాలు. అజిత్ తండ్రి సుబ్రమణ్యం కూడా మూడేళ్ళ క్రితమే వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. అజిత్ కుమార్ తల్లి మోహిని మణి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన సింధీ కుటుంబానికి చెందినవారు.
అజిత్ తన తల్లి మరణించిన సమయంలో దుబాయ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అజిత్ తల్లి మరణం విషయం తెలిసిన కోలీవుడ్ ప్రముఖులు అజిత్ కి సంతాపం తెలుపుతున్నారు.
Ajith Mother Passes Away







































