Advertisementt

సింగర్ మంగ్లీ ఆమె సోదరుడి పై కేసు

Sat 11th Apr 2026 11:15 AM
mangli  సింగర్ మంగ్లీ ఆమె సోదరుడి పై కేసు
Singer Mangli and her brother booked in Panjagutta సింగర్ మంగ్లీ ఆమె సోదరుడి పై కేసు
Advertisement
Ads by CJ

ఈమధ్యన తన బర్త్ డే కి ఫామ్ హౌస్ లో పార్టీ ఇచ్చి కేసు లో అడ్డంగా ఇరుక్కున్న సింగర్ మంగ్లీ .. తనేం నేరం చెయ్యలేదు, బర్త్ డే పార్టీ ఇచ్చాను తప్పేమిటి అని కవర్ చేసుకుంది. ఇప్పుడు తాజాగా సింగర్ మంగ్లీ పై చీటింగ్ కేసు నమోదు  అయ్యింది. ఆమెతో పాటు తన సోదరుడు శివపై సైతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. 

సింగర్ మంగ్లీ, దర్శకుడు వేణు  తనను మోసం చేసారని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది ఆరోపించడమే కాకుండా ఆమెపై ఆమె సోదరుడిపై సదరు న్యాయవాది ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితోపాటు మరో ముగ్గురిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు.

మంగ్లీ ఆమె సోదరుడు శివ, మరికొంత మంది కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని చెప్పి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేశారని.. కానీ కాలం గడుస్తున్నప్పటికీ లాభాలు ఇవ్వకపోగా.. అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితుడు ఆరోపించారు. 

డబ్బు ఇవ్వకపోగా.. తనకు ఫోన్ చేసి మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు బెదిరింపులకు పాల్పడినట్టు, తనకు వారి నుంచి ప్రాణ హాని ఉంది అని పంజాగుట్ట పిఎస్ లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Singer Mangli and her brother booked in Panjagutta:

Mangli her brother Shiva, and Venu Udugula face a case at Panjagutta

Tags:   MANGLI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ