సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ బ్లాక్ బస్టర్ చిత్రం జైలర్ కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న జైలర్ 2 చిత్రం పై బోలేడన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జైలర్ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ కాదు కాదు కీ రోల్స్ ప్లే చేస్తే.. జైలర్2 లో అంతకు మించి కీ రోల్స్ కోసం స్టార్స్ ని నెల్సన్ తీసుకురావాల్సి ఉంది.
జైలర్ 2 లో ముందు నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది. బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా జైలర్ 2 లో గెస్ట్ రోల్ చేస్తారని అన్నారు, ఆతర్వాత బాలయ్య రిజెక్ట్ చేసారు.. ఆ రోల్ కి బాలీవుడ్ స్టార్ కింగ్ ఖాన్ షారుఖ్ వచ్చారు.. ఆయన జైలర్ 2 సెట్ లోకి కూడా ఎంటర్ కాబోతున్నారని న్యూస్ వైరల్ అవ్వగా. షారుఖ్ కూడా జైలర్ 2 రోల్ రిజెక్ట్ చేసారని అన్నారు.
ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు సాంఘీక మద్యమాల్లో వినిపిస్తుంది. మరి నిజంగా తెలుగు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే.. థియేటర్స్‌లో పండగే కాదు… థియేటర్స్ తగలపడి పోతాయి.
అయితే ఇవన్నీ జైలర్ 2 పై హైప్ క్రియేట్ చేసారు రూమర్స్ తప్ప పవన్ కళ్యాణ్ జైలర్ 2 లో కనిపించే చాన్స్ లేదు.. ఇది జస్ట్ రూమర్ అంటున్నారు కొందరు. చూద్దాం జైలర్ లో ఆ కీ రోల్ కి ఏ స్టార్ వస్తారో అనేది.




ఈ వారం ఓటీటీ రిలీజులు

Loading..