పూజ హెగ్డే కిర్రాక్ లుక్

Pooja Hegde latest look viralPooja Hegde latest look viral


కొద్దిరోజులుగా టాలీవుడ్ లో వినబడని పేరు పూజ హెగ్డే. వరస ఫెయిల్యూర్స్ అమ్మడుని కాస్త వెనక్కి నెట్టినా తమిళనాట బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయినప్పటికి అమ్మడుకి అవకాశాలు ఆగలేదు. తాజాగా తెలుగులో దుల్కర్ సల్మాన్ తో DQ41 చేస్తుంది.

అలాగే బాలీవుడ్ లోను పూజ హెగ్డే ఇప్పుడు బిజీగా కనిపిస్తుంది. ఈమధ్యన పూజ హెగ్డే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా కనిపించడం లేదు. ఈ మధ్యన ఎక్కువగా మృణాల్ ఠాకూర్ తో కలిసి హడావిడి చేస్తున్న పూజ హెగ్డే సోలో లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అది కూడా జీన్స్ టాప్ అండ్ ప్యాంట్ లో లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో ఇచ్చిన ఫోజులకు యూత్ కి నిద్ర పట్టదు.  కాస్ట్లీ వాచ్ తో పూజ హెగ్డే లేటెస్ట్ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక పూజ హెగ్డే తమిళనాట నటించిన జన నాయగన్ విడుదల కావాల్సి ఉంది.

Pooja Hegde new look