వారణాసికి లీకుల గోల

Varanasi leaked footageVaranasi leaked footage


దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహెష్ తో చేస్తున్న వారణాసి మూవీ కి సంబందించిన డీటెయిల్స్ లేట్ చెయ్యడంతో.. లీకుల రాయుళ్లు వారణాసి కీలక షెడ్యూల్ నుంచి మహేష్ బాబు వీడియో ని లీక్ చేసి వైరల్ చేసారు. ఆతర్వాత #GlobeTrotter ఈవెంట్ కి సంబందించిన వీడియోస్ ని లీక్ చేసారు.

ఇక ఆ ఈవెంట్ లో వారణాసి కి సంబందించిన చాలా అప్ డేట్స్ ని వీడియో లో ఇవ్వడమే కాదు, మరికొన్ని అప్ డేట్స్ ని రాజమౌళి రివీల్ చేసారు. ఆతర్వాత వారణాసి హాలీవుడ్ ఇంటర్వూస్ లోను వారణాసి కి సంబందించిన మరిన్ని విషయాలు రివీల్ అయ్యాయి. ప్రస్తుతం లాంగ్ షెడ్యూల్ ప్లాన్ లో ఉన్న రాజమౌళికి లీకుల రాయుళ్లు మరో షాక్ ఇచ్చారు.

తాజాగా వారణాసి మూవీ లోని కీ షెడ్యూల్ లో ఉగ్ర‌భ‌ట్టి గుహ‌ల నేప‌థ్యంలో చిత్రీకరించిన కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించింది. వాటికి సంబంధించిన విజువ‌ల్స్ ని ఇపుడు ఎవ‌రో లీక్ చేశారు. సినిమా విడుద‌ల‌కు ఇంకా చాలా సమయం ఉండగా.. రాజమౌళి త్వరగా షూటింగ్ చక్కబెట్టాలని తొందరలో ఉన్నారు. అదే స‌మ‌యంలో ఇన్ని లీకులు జ‌ర‌గ‌డం షాకింగ్ విష‌య‌మే.

మరి ఈ లీకులను అడ్డుకునేందుకు రాజమౌళి ఎలాంటి ప్లాన్ చేసుకుంటారో కానీ.. ఆ లీకులు చూసుకుని మహేష్ అభిమానులు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Varanasi key scenes leaked