Advertisementt

ఫౌజీ ఎందుకింత హరీబరి

Thu 09th Apr 2026 08:35 PM
fauzi  ఫౌజీ ఎందుకింత హరీబరి
Fauzi Movie release update ఫౌజీ ఎందుకింత హరీబరి
Advertisement
Ads by CJ

ఈమధ్యన ఇచ్చిన రిలీజ్ డేట్ ని అందుకోవడానికి ఒక్కో చిత్రానికి రెండు యూనిట్ లు పని చెయ్యడమే కాదు దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అంతా రేయింబవళ్లు పని చెయ్యడం అనేది ఫ్యాషన్ అయిపొయింది. అన్ని చూసుకునే కదా రిలీజ్ డేట్ లాక్ చేసేది. కానీ ఆ డేట్ ని అందుకోవడానికి చిత్ర బృందం పడని కష్టాలు లేవు.

అసలు ఎందుకింత ప్లానింగ్ లోపం. దర్శకుల్లో ప్రోబ్లమో, హీరోలు సరిగ్గా డేట్స్ ఇవ్వట్లేదు ఏమో తెలియదు కానీ.. రిలీజ్ డేట్స్ ని పదే పదే మారుస్తూ అభిమానులను, ఇతరుల సినిమాలను ఇబ్బంది పెట్టడం రొటీన్ అయిపొయింది. ప్రస్తుతం పెద్ది విషయమే కాదు, రాబోయే పెద్ద సినిమాల పరిస్థితి అదే.

పాన్ ఇండియా ప్రభాస్ సినిమాలు ఏవి అనుకున్న సమయానికి రావు. ఇప్పుడు ఫౌజీ పరిస్తితి అదే అంటూ వార్తలొస్తున్నాయి. ఫౌజీ దసరా నుంచి కూడా రిలీజ్ డేట్ మార్చే అవకాశం ఉంది, డిసెంబర్ లో ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈలోపు.. మరో న్యూస్ హైలెట్ అవుతోంది.

ముఖ్యమైన నటులపై ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తూ.. మ‌రోవైపు ఫౌజీ లో కీలకమైన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు. ఫౌజీ ని అనుకొన్న స‌మ‌యానికే విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. అందుకోసం సెకండ్ యూనిట్ ని కూడా సిద్ధం చేసింది.. అంటూ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు ప్రచారంలోకి వచ్చాయి. 

Fauzi Movie release update:

Prabhas Fauzi Movie 

Tags:   FAUZI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ