Advertisementt

ప్రభాస్ స్పిరిట్ సెట్ లో అగ్ని ప్రమాదం

Thu 09th Apr 2026 07:47 PM
spirit  ప్రభాస్ స్పిరిట్ సెట్ లో అగ్ని ప్రమాదం
Fire accident on the set of Spirit ప్రభాస్ స్పిరిట్ సెట్ లో అగ్ని ప్రమాదం
Advertisement
Ads by CJ

కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న స్పిరిట్ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో మొదలయ్యింది. ఈచిత్రం మొదలు కాకముందే దీపికా పదుకొనే ను హీరోయిన్ గా ఎంపిక చేసి రిజెక్ట్ చెయ్యడం అప్పట్లో దుమారాన్ని రేపింది. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి త్రిప్తి డుమ్రి వచ్చి చేరింది.

ఇక డిసెంబర్లో ఓ షెడ్యూల్ అయ్యాక ఈ ఏడాది గోవాలో ప్రభాస్ లేని సీన్స్ ని సందీప్ రెడ్డి తెరకెక్కించారు. తాజాగా స్పిరిట్ సెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్పిరిట్ సహాయక బృందం లో ఒకరికి స్వల్ప గాయాలు అవడమే కాకుండా స్పిరిట్ చిత్రం కోసం వేసిన టెంట్స్ అలాగే ఇతర సామాగ్రి పాక్షికంగా కాలిపోయినట్లుగా తెలుస్తుంది. 

ప్రస్తుతం స్పిరిట్ సెట్లో ప్రభాస్ లేరు అని.. ఈ అగ్ని ప్రమాదం వలన పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చిత్ర బృందం చెప్పింది. ఇక గత రాత్రి ప్రభాస్ ఇంకా సందీప్ వంగ కల్సి హైదరాబాద్ అల్లు సినిమాస్ లో ధురంధర్ 2 ని వీక్షించారు. 

Fire accident on the set of Spirit:

Fire accident on the set of Prabhas Spirit

Tags:   SPIRIT
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ