Advertisementt

పవన్ చుట్టూ పనికిమాలినవాళ్లు

Thu 09th Apr 2026 12:18 PM
pawan kalyan  పవన్ చుట్టూ పనికిమాలినవాళ్లు
Pawan Kalyan పవన్ చుట్టూ పనికిమాలినవాళ్లు
Advertisement
Ads by CJ

జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఉన్నవాళ్ళ గురించి పట్టించుకోవడం లేదా, లేదంటే చుట్టూ జరుగుతున్న సమస్యలు ఆయన దృష్టికి రావడం లేదో తెలియదు కానీ.. జనసేన నేతలు, జనసేన ఎమ్యెల్యేలు తప్పులు మీద తప్పులు చేస్తూ మీడియాలో నానుతున్నారు. ప్రతిపక్షానికి జనసేన నేతలు కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నారు.

ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ అయిన ఆరవ శ్రీధర్ విషయమే కాదు.. మిగతా జనసేన ఎమ్యెల్యేలు చాలామంది ఇష్టానుసారం మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అరవ శ్రీధర్ పై హర్షవీణ అనే మహిళ చేస్తున్న అలిగేషన్స్ చూసాక పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ మేటర్ ని పట్టించుకోపోవడం, కొత్తగా ఎన్నికైన ఎమ్యెల్యేలు సెటిల్మెంట్ లకు దిగడం ఇవన్నీ పవన్ ని ముఖ్యంగా పార్టీని అప్రతిష్టపాలు చేయడమే అన్నట్టుగా ఉన్నాయి.

జనసేన నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్యెల్యేలకు ఎలా వ్యవహరించాలో తెలియడం లేదో, లేదంటే కూటమి పట్టు కోసం పాకులాటో తెలియదు కానీ.. వారు వ్యక్తిగత ప్రతిష్టకు పోవడమే కాదు, మరికొందరు అధికారులపై ఒత్తిడి తేవడం వంటి విషయాలు జనసేన పరువు తీసేవిగా వున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ చుట్టూ పనికిమాలిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు.

పవన్ కేవలం పరిపాలన మీదే కాదు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు, బయట మీడియాలో హైలెట్ అవుతున్న విషయాలు అన్ని పట్టించుకుని తమ ఎమ్యెల్యేలు, నేతలను కట్టడి చేసి వారిని దారిలో పెట్టుకుంటే బెటర్. లేదంటే 2029 నాటికీ పార్టీ ఎలా ఉంటుందో అనేది పవన్ కి తెలుస్తుంది. 

Pawan Kalyan :

Janasena Pawan Kalyan 

Tags:   PAWAN KALYAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ