ప్రస్తుతం ఇండియా లో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, ఢిల్లీ కేప్టెన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు అంటూ పలు జట్లు ప్రతి ఐపీఎల్ సీజన్ లో పోటీపడుతుంటాయి. ఆ ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు యువత ఉత్సాహం చూపిస్తారు.
హోమ్ గ్రౌండ్స్ అయితే ప్రత్యక్షంగా, బయట ఎక్కడ జరిగినా టివిలు, ఫోన్ లకు అతుక్కుపోతుంటారు. ఆ సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తే ఐపీఎల్ ఫీవర్ లో సినిమాలను పట్టించుకోవడం లేదు. కానీ ఈఏడాది ఐపీఎల్ పై అంతగా క్రేజ్ లేదు. ఇంట్రస్టింగ్ మ్యాచ్ లు జరుగుతున్నా క్రికెట్ లవర్స్ లైట్ తీసుకుంటున్నారు.
పెద్దగా మ్యాచ్ లు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఈ ఏడాది ఐపీఎల్ ప్రభావం సినిమాలపై అస్సలు కనిపించడమే లేదు. యూత్ కూడా అదే మాట్లాడుతుంది. ఐపీఎల్ మ్యాచ్ లు బోరింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో క్రేజీ సినిమాలు విడుదలైతే వాటికి ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు.




మహిళా గౌరవం vs వెండితెర క్రియేటివిటీ
Loading..